ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్

ఆదివాసి మహిళ కార్పొరేటర్ పై అనుచిత వ్యాఖ్యలు సరైనది కాదు

కార్పొరేటర్ బాణావత్ సుజాత నాయక్ కు క్షమాపణ చెప్పాలి

ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 23 :- ఆదివాసి మహిళా కార్పొరేటర్ బాణవత్ సుజాత నాయక్ పై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖబర్దార్ మా ఆదివాసి మహిళ కార్పొరేటర్ సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన నువ్వు వెంటనే మా ఆడబిడ్డకు క్షమాపణ చెప్పాలని అదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆదివాసి మహిళ అని చూడకుండా అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం సమాజానికి సిగ్గుచేటని సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయ సమాజానికి పనికి రాడని తను తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆదివాసుల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు దొరల అహంకార ధోరణిని మార్చుకోకపోతే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ మండల చైర్మన్లు ఆత్రం ఊర్వేత ఆనందరావు రాజేశ్వర్ వసంతరావు వెడ్మ శేఖర్ జాదో రోహిదాస్ ప్రేమ్ దాస్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?