ఎల్ఆర్ఎస్ పై 25% రాయితీ
ముధోల్ ఎంపీడీవో శివకుమార్
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 11 :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ పై 25 శాతం రాయితీని కల్పిస్తుందని ముధోల్ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ముధోల్లోని మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ (ప్లాట్ల స్థలముల క్రమబద్దీకరణ)ను ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 31తేదీల్లోగా క్రమబద్ధీకరణ చేసుకున్నట్లయితే 25 శాతం రాయితీ కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని ఆయన కోరారు