

ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు
శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 16 : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని ఎలికట్ట శ్రీ అంబా భవాని మాత దేవాలయం పూజారి శివ శంకర భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ ద్వారా బిరుదులు ప్రధానం చేశారు. హైదరాబాద్ లో జరిగిన రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఉగాది మహోత్సవ సువర్ణ ఘంటా కంకణం గోల్డ్ మెడల్స్ అవార్డును శివ శంకర భవాని ప్రసాద్ అందుకోవడం విశేషం. హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ లో ఈ వార్డును అందుకున్నట్లు శివ శంకర భవాని ప్రసాద్ మీడియాకు తెలిపారు. సంస్థ నిర్వాహకులు పరుగులు ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ బిరుదును అందుకున్నట్లు తెలిపారు.