ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం
మనోరంజని ప్రతినిధి మార్చి 11
ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. కూటమి అభ్యర్థుల ఐదుగురి నామినేషన్లకు మంగళవారం అధికారులు ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పోటీలో ఉన్నారు. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు పోటీలో దిగనున్నారు.