

మనోరంజని ప్రతినిధి, మంచిర్యాల మార్చి 21- మంచిర్యాల జిల్లా,భీమారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని గోత్రాల వాడలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కృషి వల్ల బోర్వెల్ వేయడం జరిగింది. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెల్లిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రజల నీటి కష్టాన్ని తీర్చడం జరిగింది ఈ సందర్భంగా గోత్రాల వాడ ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్, మరియు సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ షడంశెట్టి రమేష్, మరియు తాళ్ల ప్రభాకర్.. కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది..