ఎమ్మెల్యే” ఉత్సవ విగ్రహం కాదు..!

ఎమ్మెల్యే” ఉత్సవ విగ్రహం కాదు..!

ప్రజలు మనల్ని నమ్మి అసెంబ్లీకి పంపించారు..

సమస్యలపై స్పందిస్తేనే నియోజకవర్గానికి అభివృద్ధి

షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగిసిన తరువాత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభిప్రాయం

షాద్ నగర్ కు సాగునీటి కష్టాలు తీర్చే కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కు ఆమోదం సంతోషకరం

పశుగణాభివృద్ధి కేంద్రానికి 21 కోట్లు మంజూరు పట్ల ఆనందం

ఎస్సీ వర్గీకరణ, బిసి బిల్లులను ఆమోదించడం పట్ల సంతృప్తి

లంబాడీల గోర్ బోలి భాషకు రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని ఆమోదం పట్ల హర్షం

ప్రతిపక్షాలను సమర్ధవంతంగా కట్టడి చేశాం..

ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపిస్తే.. బాధ్యత గల ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహం కాకుకూడదని సమస్యలపై ప్రతినిత్యం స్పందించాలన్నదే తన అభిమాతమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో తల మునకలైపోయారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలను సభలో ప్రస్తావించడం, అదేవిధంగా శాసనసభ జరిగిన తీరు తదితర విషయాలపై మీడియా ప్రశ్నలు సంధించగా ఆయన సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మొత్తం 11 రోజుల పాటు శాసన సభ సమావేశాలు సాగాయనీ, మొత్తం 97 గంటల 32 నిమిషాల పాటు శాసన సభ కొనసాగిందనీ ఈ 11 రోజుల్లో 12 బిల్లులను ప్రవేశ పెట్టి అసెంబ్లీ ఆమోదం తెలిపిందనీ ఇది సభ్యుడిగా తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

షాద్ నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కర్తవ్యం

షాద్ నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రాజెక్టుల అంశం ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో నియోజకవర్గంలోని కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి కూడా నిధులు కేటాయిస్తూ ఆమోదం తెలిపడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
ప్రభుత్వం ఈ ప్రాంతంపై చూపిస్తున్న శ్రద్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల కృషి అనిర్వచనీయమని పేర్కొన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణంలో ఆరు లిఫ్టులలో చివరిది ఆరవది అయిన కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం గత పది సంవత్సరాలలో ఇక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మార్చారని గత ప్రభుత్వ తీరుని దుయ్యబట్టారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో ఈ నిర్లక్ష్యంపై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు నిలదీశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా లక్ష్మీదేవి పల్లిని ప్రారంభిస్తామని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆనాడే భట్టి విక్రమార్క, యుద్దనొక గద్దర్
ప్రకటించారని, అనుకున్న విధంగానే ఎంతో చిత్తశుద్ధితో ప్రభుత్వం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. నియోజకవర్గానికి సాగు అందించడం తన లక్ష్యమని అది త్వరలోనే నెరబరబోపోతుందని, అదేవిధంగా భూసేకరణ కోసం కూడా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు తరాలకు మంచి చేయాలని సంకల్పంతో అనేక విషయాల్లో ఆలోచనలు చేస్తుందని తెలిపారు. గోదావరి ద్వారా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడి హేట్టి ద్వారా నూతన ప్రణాళిక కూడా ప్రభుత్వం మరో రెండవ ఆలోచన కూడా చేస్తుందని, తద్వారా కృష్ణా జిల్లాలో అనుసంధానం చేయాలని మరో ఆలోచన ఉన్నట్లు సూచనప్రాయంగా తెలిపారు.

పశుగణాభివృద్ధి కోసం రూ. 21 కోట్లు

గత ప్రభుత్వం ఫరుక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామంలో చేపట్టిన పశు వీర్య గణభివృద్ధి కేంద్రం పై నిర్లక్ష్యం చేయడంతో ఈ కేంద్రం అమల్లోకి రాలేదని దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగిందని అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించడంతో ప్రభుత్వం 21 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఈ కేంద్రాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. దీనివల్ల రైతన్న గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అదేవిధంగా విజయ డైరీ పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా ప్రస్తావించామని, పాడి రైతులకు ప్రయోజనం చేకూరేలా అసెంబ్లీలో చర్చించడం జరిగిందని తెలిపారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి అంశంపై ప్రస్తావించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసే విధంగా సాంకేతిక లోపాలతో పెండింగ్లో ఉన్న రుణమాఫీ వ్యవహారాన్ని పూర్తి చేయాలని సూచన అసెంబ్లీలో చేసినట్లు తెలిపారు.

సుదీర్ఘ కాల సమస్యలకు పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా సమస్యలు ఏర్పడిన అనేక చారిత్రాత్మక అంశాలను ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరిగణలోకి తీసుకొని వాటికి దశాదిశా చూపడం ఒక శాసన సభ్యుడిగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. ముఖ్యంగా మాదిగల ఆత్మగౌరవ ప్రతీక ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదింప చేయడం చారిత్రాత్మకమని గుర్తు చేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రేవంత్ రెడ్డి సర్కార్ రచించిన ప్రణాళికలో భాగంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా అసెంబ్లీ ఆమోదించడం మరువలేని అంశమని అన్నారు. అలాగే లంబాడీల గోర్ బోలి భాషకు రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో చేర్చే విధంగా శాసనసభ ఆమోదించడం కూడా ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
చరిత్రలో నిలిచిపోయే అంశాలను ఈ శాసనసభ ఆమోదించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు అంటే ఉత్సవ విగ్రహాలుగా కెసిఆర్ ప్రభుత్వం భావించిందని, కానీ ఈ ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలు కాదని ప్రజా సమస్యలపై నిత్యం ముఖ్యమంత్రిని పలు సందర్భాల్లో కలుస్తూ సమస్యలు విన్నవిస్తున్నామని అదేవిధంగా శాసనసభలో కూడా అనేక అంశాలను పై ప్రస్తావించి వాటికి పరిష్కారం మార్గం చూపుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించడమే గగనమైపోయిందని ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఎలాంటిదో అందరికీ తెలుసని గుర్తు చేశారు.
ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్న సీఎంగా రేవంత్ రెడ్డికి పేరు ఉందని తెలిపారు. గత సీఎం 10 ఏళ్లపాటు ఫామ్ హౌస్ కేంద్రంగా పరిపాలన సాగిందని విమర్శించారు. ఎమ్మెల్యేలు కలవడానికి భయపడేవారని, ఎమ్మెల్యేలతో అప్పటి సీఎం కేసీఆర్ అప్పట్లో కలిసిన అంశాలను వేళ్లపై లెక్కపెట్టి చెప్పవచ్చని ఎద్దేవా చేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా అభివృద్ధిని మరిచి ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలను అసెంబ్లీలో శాసనసభ మంచి కట్టడం చేసిందన్నారు. ఈ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షం తమ ఉనికి కోల్పోయిందని, అర్థం లేని ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం