

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల రైతులు, ఎఫ్‌పిఓ ద్వారా వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌పిఓ (Farmer Producer Organization) ఒకే పార్టీకి చెందినది కాకుండా, అన్ని పార్టీలకు చెందిన రైతుల సమాఖ్య కావడం వల్ల ప్రతి రైతుకూ లాభ నష్టాలు పంచిపడతాయి. గత నాలుగు సీజన్లుగా ఎఫ్‌పిఓ ద్వారా వరి కొనుగోలు చేయడం జరుగుతోంది. అయితే ప్రస్తుత వరి కోతల నేపథ్యంలో, అదనపు పిపీసి సెంటర్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు ఈ విషయమై వినతిపత్రం సమర్పించగా, ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వరి కోతలు మొదలైన నేపథ్యంలో, ఇప్పటికైనా ఎఫ్‌పిఓ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు అడిషనల్ కలెక్టర్‌ను కోరారు. ధర్పల్లి మండల కేంద్రంతో పాటు రామడుగు, దుబ్బాక, మైలారం, హోన్నజిపేట్ గ్రామాల్లో కూడా PPC కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, ధర్పల్లి మండల ఎఫ్‌పిఓ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, కోశాధికారి నల్ల పెంటన్న, సీఈఓ సుజాత, మాదావత్ గంగాధర్, అమృనాయక్, గడ్డం అశోక్, నాగయ్య గంగారెడ్డి, కొట్టాల నరేష్ గౌడ్, సదానంద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కూర గంగాధర్, బుర్రన్న, చెలిమెల గంగాధర్, కిషన్, రామడుగు భానుచందర్, గోవింద్‌పల్లి శ్రీకాంత్ భగత్, శీను, రైతులు పాల్గొన్నారు.