ఎన్ హెచ్ ఆర్ సి. సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధిగా నామ వేణు.
నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
మనోరంజని ప్రతినిధి సూర్యాపేట మార్చి 11 : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సూర్యాపేట జిల్లా కమిటీ అధికార ప్రతినిధిగా నామ వేణును నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఉత్తర్వులు జారీ చేసినట్లు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మెహేందికార్ సందీప్, జిల్లా ఉపాధ్యక్షులు కోటాచారి తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధిగా నియామకమైన నామ వేణు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని నీతి నిజాయితీతో నిర్వహిస్తానని, తనకు ఈ పదవి రావడానికి చేసిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధిగా నామ వేణు నియామకంతో జిల్లాలో సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.