

ఎన్ హెచ్ ఆర్ సి. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయి కృష్ణ.
నియామక ఉత్తర్వులు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
కామారెడ్డి టౌన్: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులుగా జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమకారులు వడ్ల సాయికృష్ణను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల నారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నియామకమైన వడ్ల సాయికృష్ణ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని నీతి నిజాయితీతో నిర్వహిస్తానని, తనకు ఈ పదవి రావడానికి చేసిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా వడ్ల సాయికృష్ణ నియామకంతో జిల్లాలో సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.