

ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి
తెలంగాణ : తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. డీలిమిటేషన్ పైన డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు