

ఎన్కౌంటర్పై అమిత్ షా సంచలన పోస్టు!
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన పోస్టు చేశారు. ‘ఈరోజు మన సైనికులు ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారు. ఛత్తీస్గఢ్లోని భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు హతమయ్యారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. ‘ అని రాసుకొచ్చారు.