

ఉల్లాసంగా…ఉత్సాహంగా ముందస్తు ఉగాది వేడుకలు
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని శ్రీ అక్షర, రబింద్ర, సరస్వతి శిశు మందిర్, లిటిల్ ఫ్లవర్ పాఠశాల, బ్రహ్మణ్ గావ్ లోని హైందవి పాఠశాలలో శనివారం ఉగాది పండుగను ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పచ్చటి తోరణాలతో మండపమును ఏర్పాటు చేసి విద్యార్థులు విద్యార్థినులు ఆరు రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసి పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలతో పాటు పాఠశాల యాజమాన్యానికి పంచి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది ఆదివారం సెలవు రోజు రావడంతో ముందస్తుగా పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ అక్షర, రబింద్ర, శ్రీ సరస్వతి శిశు మందిర్ , లిటిల్ ఫ్లవర్ స్కూల్ సుభాష్, ప్రిన్సిపాల్స్ అసంవార్ సాయినాథ్, సారథి రాజు, నజీబ్ మాట్లాడుతూ ఉగాది పచ్చడి తయారు చేసే విధానం ,ఉగాది యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ పాఠశాల ఆవరణలో ఉగాది సంబరాలు జరుపుకోవడంతో విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను, ప్రతి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుంటారని అన్నారు. అందుకే ప్రతి పండగను పాఠశాలలో విద్యార్థులతో జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు