

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 21 :- ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఈ విషయంపై సంబంధిత జిల్లాల కలెక్టర్లతో తక్షణమే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు