ఉమెన్స్ డే: రాబోయేది మాతృస్వామ్యం !

ఉమెన్స్ డే: రాబోయేది మాతృస్వామ్యం !

లేచింది మహిళా లోకం అనే పాట.. సినిమాలో వచ్చినప్పుడు ఏదో మహిళల్ని కాస్త ధియేటర్లకు రప్పించడానికి పొగుడుతున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు మహిళా లోకం నిజంగానే లేచింది. సమానత్వం కోసం అడగాల్సిన అవసరం లేదు. సమానత్వం తప్పక కల్పించాల్సి వస్తోంది. ఇంకా చెప్పాలంటే వారే ప్రధానంగా ఎదుగుతున్నారు. పరిస్థితి ఎలా మారిందంటే.. కొద్ది కాలంలోనే అంటే ఈ తరంలోనే మాతృస్వామ్యాన్ని మనం చూడబోతున్నాం.

భవిష్యత్ మహిళలదే అనడానికి ఎన్నో సాక్ష్యాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఏదైనా స్కూల్ కు వెళ్లండి.. క్లాస్‌లో సగం మంది ఆడపిల్లలు ఉంటున్నారు.గతంలో ఏదైనా స్కూల్ లో .. 90 శాతం మగపిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ వరకూ..ఏ క్లాస్ లో చూసినా సగం మంది ఆడపిల్లలు కనిపిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఓ ఆడపిల్ల ఉండాలనుకుంటున్నారు. ఉంటున్నారు కూడా. ఇది వచ్చిన మార్పు. అంటే.. రాబోయే రోజుల్లో ఈ మహిళా ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.

త్వరలో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అది రాజకీయంగా వారికి ఉపయోగపడుతుందేమో కానీ ప్రతిభ మాత్రమే అవసరమైన రంగాల్లో ఇప్పటికే మహిళా ప్రభంజనం కనిపిస్తోంది. ఉద్యోగాల్లో మహిళలకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ అవకాశాలు వారు మహిళలు అయినందుకే లభించడం లేదు. మగవాళ్లతో పోటీ పడి.. వారి కన్నా ప్రతిభావంతులం అని నిరూపించుకునే అవకాశాలు పొందుతున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో ఉన్న అమ్మాయిలు కెరీర్ కోసం మొదటి అడుగు వేస్తే.. వారదే రాజ్యం అవుతుంది.

మహిళలకు ఇప్పుడు ఆత్మగౌరవం ఉంది. ఆత్మవిశ్వాసం ఉంది. కుటుంబాన్ని కూడా చక్కదిద్దే నైపుణ్యం… ఆర్థిక విషయాలపై అవగాహన.. కెరీర్ లో దూసుకెళ్లడం.. ఇలా దేంట్లోనూ వారు మహిళలు అని తక్కువ చూపు చూసే పరిస్థితి లేదు. ఇది సమాజంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. రాబోయే మహిళా ప్రభంజనానికి ఇది సూచికగా కనిపిస్తోంది. మన దేశ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ పితృస్వామ్యం మీదనే ఉంది. రాబోయే రోజుల్లో ఇది మాతృస్వామ్యంగా మారుతుంది. ఇది సమాజానికి అవసరం కూడా !

  • Related Posts

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి