

తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ సంఘం (TTREITA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ పై ఆన్లైన్ సదస్సు
హైదరాబాద్ మార్చి 08 మనోరంజని ప్రతినిధి, – తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ సంఘం (TTREITA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల కొరకు మార్చి 8, 2025న ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ అనే అంశంపై ఆన్లైన్ సదస్సును నిర్వహించారు,ఈ సదస్సుకు ప్రఖ్యాత కౌన్సిలర్, RIE మైసూరు ప్రొఫెసర్ డా. భారతి కులశేఖర్ వక్తగా వ్యవహరించారు. ఆమె ప్రసంగంలో మహిళలు తమ ఉద్యోగాన్ని తమ ఛాయిస్‌గా గుర్తించుకోవాలని, ‘నేను అన్నీ చేయగలను’ అనే సూపర్ వుమెన్ సిండ్రోమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే విధంగా, తమను తాము ప్రేమించుకోవాలని, తమ కోసం కొంత సమయం కేటాయించుకోవాలని సూచించారు,అలాగే, మన మనోభావాలను సకారాత్మకమైన అంశాలపై ఖర్చు చేయరాదని, ఏ జ్ఞాపకాలైనా డేటాగా మాత్రమే భద్రపరచుకోవాలని, ఎమోషన్స్ జతపరిస్తే మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశముందని తెలిపారు,మహిళలు తమ శక్తిని, ప్రతిభను ప్రపంచాన్ని మరింత మెరుగ్గా చేసేందుకు వినియోగించుకోవాలని, నిరంతరం ప్రోత్సాహించుకుంటూ మరింత సాధికారత దిశగా ముందుకు సాగాలని సూచించారు, ఈ కార్యక్రమంలో TTREITA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రుషికేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రామచందర్ రావు, అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి గారు మరియు కేంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొని మహిళా ఉపాధ్యాయులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ సదస్సు మహిళా ఉపాధ్యాయుల్లో మంచి ప్రేరణను కలిగించినట్లు అంతా అభిప్రాయపడ్డారు.