

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 24 – కరీంనగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్,సుదర్శన్,జిల్లా నాయకులు జి.రాజేశ్వర్,ఆర్.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు


