

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు
మనోరంజని ప్రతినిధి :- తానుర్ ఫిబ్రవరి 28 సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని మండల విద్యాధికారి బాశేట్టి నరేందర్ అన్నారు. శుక్రవారం తానూర్ మండలంలోని కోలూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయుడు కందూర్ గంగాధర్ యాదవ్ పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత కందూర్ గంగాధర్ యాదవ్ -యమునా దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడారు..విధి నిర్వహణలో భాగంగా తానూర్ మండలంలోని కోలూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి విద్యార్థులు గ్రామస్తుల మన్ననలు పొందారని కొనియాడారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచే ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు అన్నారు. అంకితభావంతో పనిచేసిన గంగాధర్ ని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.పదవీ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్పీయూ మండల అధ్యక్షుడు పండరి, జనరల్ సెక్రటరీ సుధాకర్,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు