ఉపాధ్యాయులు కృత్రిమ మేధ వంటి మార్పులను అలవాటు చేసుకోవాలి.జిల్లా విద్యాశాఖ అధికారి.

ఉపాధ్యాయులు కృత్రిమ మేధ వంటి మార్పులను అలవాటు చేసుకోవాలి.
జిల్లా విద్యాశాఖ అధికారి.

మనోరంజని ప్రతినిధినిర్మల్ మార్చి 29 :-జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లాలోని ఈనెలలో అనగా మార్చి 31 వ తేదీన పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు శనివారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ చరిత్రలో తొలిసారిగా పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు 7 గురికి జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలి, విద్యార్థులకు విద్యా బోధనను కూడా అందించడం జరిగుతుంది. వీరు ఎందరో భావి పౌరులను దేశానికి అందించడం జరిగిందని. వీరి కృషికి గుర్తింపు చాలా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు కృత్రిమ మీద సహాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారుని, ఉపాధ్యాయులు కాలానుగుణంగా మార్పును గ్రహించాలని, వాటిని అలవాటు చేసుకోవాలని సూచించారు. పదవి విరమణ పొందు ఉపాధ్యాయులు తమ భావి జీవితాన్ని మంచి ఆరోగ్యంతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి రమణా రెడ్డి, పరీక్షల సహాయ కమీషనర్ ముడారపు పరమేశ్వర్, విద్యాశాఖ పర్యవేక్షకులు వెంకట రమణ, విద్యాశాఖ సమన్వయ కర్తలు రాజేశ్వర్, నర్సయ్య, సలోమీ కరుణ, ప్రవీణ్ కుమార్, లింబాద్రి, డి సీ ఈ బి సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం