ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

ఉడుకుతున్న తెలంగాణ.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలు
మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ
25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. వడగాడ్పులపై కేంద్రం అడ్వైజరీ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ రెండు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. శుక్రవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా… జగిత్యాల జిల్లా గోధూరు, గద్వాలలోని మల్దకల్, మంచిర్యాలలోని జానకాపూర్, నల్గొండలోని దామరచర్ల, నిజామాబాద్‌లోని ధర్పల్లిలో 40.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక మరో నాలుగు జిల్లాల్లో 40.8, మూడు జిల్లాల్లో 40.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఒక్క హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.7 డిగ్రీలు రికార్డయింది. మరో రెండు మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత రెండ్రోజులకు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉండే చాన్స్ ఉందంది.

కేంద్రం అలర్ట్..

దేశంలో ఎండలు మండిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకూ హీట్వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వడగాడ్పులను అంచనా వేస్తుండాలని సూచించింది. హీట్వేవ్స్‌పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బులెటిన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. మెడికల్ ఆఫీసర్లు, హెల్త్స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించారు. వడదెబ్బకు గురైన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. యాక్టివ్, ఎమర్జెన్సీ కూలింగ్ పరికరాలను ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆస్పత్రుల్లో ఫైర్సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్, మందులు, ఫ్లూయిడ్లు (సెలైన్లు), ఐస్ప్యాక్‌లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. హీట్స్ట్రోక్ మేనేజ్‌మెంట్యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం