

ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.
*మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మరియు ఆంతరంగిక చైతన్యానికి ఉపయోగపడే యోగ ధ్యాన కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్న శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థ భీమారంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిబిరాన్ని స్థానిక ఎస్సై కె. శ్వేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మానసిక, మరియు శారీరక ఆరోగ్యానికి యోగ మరియు ధ్యానము చాలా ముఖ్యమైనది అన్నారు. మూడు రోజులు గీత హై స్కూల్ (గుడ్ మార్నింగ్ స్కూల్) యందు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలరని సంస్థ ట్రైనర్ పర్శ శ్రీనివాస్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి. సత్యం, ఎన్. కల్పన, ఎం. పద్మ, పి. మధు, జి. పవన్, మరియు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు.