

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక ఐక్యతను, కులాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలని సూచిస్తుంది” అని పేర్కొన్నారు. ఇటీవల భారత్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోందని, “మోడీ నాయకత్వంలో మన దేశ ఖ్యాతి మరింత పెరుగుతోంది. కొత్త సంవత్సరం భారత ప్రజలకు శుభసూచకం కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.బీజేపీ కార్యకర్తలంతా కొత్త సంవత్సరంలో బలోపేతానికి కృషి చేయాలని, “ఇప్పటికే బూత్, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు పూర్తయ్యాయి. త్వరలో రాష్ట్ర, జాతీయ కమిటీలు ఏర్పాటు చేస్తాము” అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ “మన్ కీ బాత్” కార్యక్రమం త్వరలో ప్రారంభం కానున్నందున అందరూ వీక్షించాలని సూచించారు.