

ఈ నెల 16న బాసరలో అష్టావధానం
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 13 :-
విశాఖపట్నం వాస్తవ్యులు ప్రముఖ అవధానులు బొల్లాప్రగడ శశిశర్మగారిచే అష్టావధానం నిర్వహించగలమని-నిర్వాహకులు,పద్యకవులు, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాదు నిజామాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు బి. వెంకట్ కవి, కడారి దశరథ్
శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల అంబికనాథశర్మ ముధోల్ విలేఖర్లకు ఒక ప్రటనలో తెలిపారు. ఈ నెల 16 న బాసరలోని శారదా నగర్ లో గల కోటి కోటి పార్థివ లింగస్తూప సాహితీ ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము హాల్లో మధ్యాహ్నము 3 గంటల నుండి ఈ అష్టావధానం కార్యక్రమము ఉంటుందని చెప్పారు. సభకు సంచాలకులుగా పద్యకవులు- బొందిడి పురుషోత్తమరావు, ప్రాశ్నికులుగా డా.కోవెలశ్రీనివాసాచార్యులు( నిషిద్ధాక్షరి), కడారి దశరథ్ (సమస్యాపూరణం), బి. వెంకట్( దత్తపది), పీసర శ్రీనివాస్ గౌడ్ (వర్ణన), గంగుల చిన్నాన్న (న్యస్తాక్షరి), కొండూరు పోతన్న (ఛందోభాషణము), జాదవ్ పుండలీక్ రావు పటేల్ (ఆశువు), బసవరాజు (అప్రస్తుతప్రసంగం) లు పాల్గొననున్నారని చెప్పారు. కవులు, కళాకారులు,మేధావులు, సాహితీవేత్తలు ,రచయితలు పొల్గొనవచ్చని చెప్పారు