ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 16 – అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ఈ నెల 19, 20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది. 10 నెలలుగా అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతు న్నారు.గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్, 61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమై య్యారు. కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా, విల్‌మోర్‌ స్పేస్‌కు వెళ్లారు. కానీ, ఊహించని పరిణా మాలతో జూన్ 5న ఫ్లోరిడా లో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం శూన్యం.. చేసేది ఏమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమిపైకి తిరిగి వచ్చింది. ఆ పరిస్థితుల్లో భూమిపైకి ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాద కరమని నాసా భావించింది. ఆ తర్వాత విల్‌మోర్‌, సునీత విలియమ్స్ ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపో వాల్సి వచ్చింది. ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ ద్వారా వారిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వీరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు. నాసా ప్రకారం.. సునీతా, విల్ మోర్ ఈ నెల 19, 20 తేదీల్లో భూమిపైకి తిరిగి రావచ్చు

  • Related Posts

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి

    అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి మనోరంజని ప్రతినిధి మార్చి 16 – అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇటీవల కార్చిచ్చు చెలరేగి భారీ నష్టం మిగల్చగా తాజాగా టోర్నడోలు, తుఫాన్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాయి. తుఫాను ధాటికి 34…

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 16 – ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్‌లో హతమయ్యాడు.ఈ ఘటన శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్‌ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .