ఇవాళ తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు శనివారం తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉ.7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 8.05 గంటలకు తణుకు చేరుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. మ.12.55 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు