ఇదీ ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్య నేపథ్యం..
మనోరంజని పతినిది మార్చి 04 ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన కొమురయ్య 1959 అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లి లో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక గత పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తరఫున మల్కాజ్ గిరి స్థానంలో టికెట్ ఆశించారు. టిపియూఎస్ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు బిజెపి మద్దతు పలికింది. బిజెపి అగ్ర నాయకులు కొమురయ్యకు అనుకూలంగా ప్రచారం చేశారు. దీంతో ఆయన ఘనవిజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారి బిజెపి బోణి కొట్టడం విశేషం..