ఇండ్ల స్థలలు, హైల్త్, కార్డులు ,ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు అందజేయాలి

ఇండ్ల స్థలలు, హైల్త్, కార్డులు ,ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు అందజేయాలి

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్

టీయూడబ్ల్యుజే ఐజేయు నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య

గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి జర్నలిస్టులకి హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లకు నియోజవర్గ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని టియూడబ్ల్యూజే ఐజేయూ నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య అన్నారు. బుధవారం రోజు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లల్లో అవకాశాలు ఇవ్వాలని, నియోజవర్గ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇండ్ల స్థలాలు ఇళ్లు కట్టిస్తామన్న ఎమ్మెల్యేల మాటలు కూడా నిలబెట్టుకోవాలని అన్నారు. నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు నిర్మాణం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. నిరంతరం అనేక వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మండలాలలో జర్నలిస్టులు గా పనిచేస్తు, మండలంలోని వేరువేరు గ్రామాలకు చెందిన వారై ఉంటారని, అందరికీ ఒకే దగ్గరగా మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. గ్రామానికి వచ్చే ఇందిరమ్మ ఇళ్లల్లో ఒకటి రెండు గృహాలను జర్నలిస్టుకు అందజేయడం ప్రజా ప్రతినిధులకు అధికారులకు పెద్ద సమస్య కాకూడదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలని వారి సొంత గ్రామాలలో జర్నలిస్టు దరఖాస్తు చేసుకుంటే వాటిని ప్రత్యేకంగా భావించి కచ్చితంగా మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై స్థానిక ఇన్చార్జి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ తో చర్చించి ఇళ్లస్థలాల పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, జర్నలిస్టు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చ విధంగా కృషి చేయాలన్నారు.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం