

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభాశీస్సులు : హరీష్ రావు..!!!
సిద్దిపేట ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు రాసే సిద్దిపేట జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ భవిష్యత్తు పునాది లాంటిదని పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి వారి కలలను నిజం చేయాలన్నారు. అదే విధంగా అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలన్నారు