

ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి, ఆయుష్మాన్ వే వందన కార్డు అర్హత వయస్సును 70నుంచి 60సంవత్సరాలకు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇది అమలులోకి వస్తే.. మరో 4.5కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ప్రస్తుతం భారతదేశంలో 40శాతం కంటే ఎక్కువమంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యసౌకర్యాలను పొందుతున్నారు. వైట్ కార్డు తో సంబంధం లేకుండా 5 లక్షలు ఆరోగ్య భీమా వస్తుంది.