ఆస్ట్రేలియా బ్యాటర్ల వేగానికి షమీ కళ్లెం వేయాలి: హర్భజన్ సింగ్
మనోరంజని ప్రతినిధి మార్చి 04 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ పోరు జరుగనుంది. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.."షమీ మనసులోంచి ముందు ట్రావిస్ హెడ్ అంటే భయాన్ని తీసివేయాలి. హెడ్ పరుగులు చేయనీయకుండా షమీ కట్టడి చేయాలి. సాధ్యమైనంత తొందరగా హెడ్‌ను పెవిలియన్ కు పంపాలి. తర్వాత మిగిలిన ఆసీస్ ఆటగాళ్లకు పరుగులు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దు." అని టీమిండియా స్టార్ బౌలర్ షమీకి సూచనలు ఇచ్చారు.