ఆసిఫాబాద్: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు.. పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
మనోరంజని ప్రతినిధి అసిఫాబాద్ మార్చి 12 :-కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, మహారాష్ట్రలోని చంద్రాపూర్-గడ్చిరోలి-సిర్వాంచ బస్సులో దేశీదారు అక్రమంగా తరలిస్తున్నారు. వాంకిడి మండలంలోని గోయాగాం వద్ద బుధవారం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 58, 970 ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.