

ఆశ వర్కర్లను అరెస్టు చేయడం అన్యాయం
సమన్వయంగా వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎ. మహేందర్ రెడ్డి
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 25
ఆశాలను అరెస్టు చేయడం అన్యాయం, న్యాయమైన వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి. తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్లో హైదరాబాద్ కార్యక్రమానికి వచ్చిన ఆశ వర్కర్లపై పోలీసులు దాడి చేయడం, అమానుషంగా అరెస్టు చేయడాని నిరసిస్తూ వెల్దుర్తి మండలంలో ప్రధాన రహదారిపై సిఐటియూ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు రూ 18000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తయిన వారికి ప్రమోషన్ సౌకర్యం , ఇన్సూరెన్స్ సౌకర్యం , ఆదివారం తో పాటు పండుగలకు సెలవులు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పని భారం తగ్గింపు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం చలో హైదరాబాదుకు కార్యక్రమానికి వచ్చిన ఆశ వర్కర్లపై పోలీసులు దాడి చేయడం , అమానుషంగా అరెస్టు చేయడానికి సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఆశ వర్కర్లకు చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలనుకుంటే ఈ ఉద్యమం ఉదృతంగా ముందుకు వస్తుందని ఆశా వర్కర్లకు ఆ చరిత్ర ఉన్నదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని. ఆశలకు అంతకంతగా పని భారం పెరుగుతున్నదని కానీ వేతనం కేవలం రూ 9700లు మాత్రమే ఇస్తున్నదని కనీస జీవనానికి కూడా ఇది సరిపోదని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు అధికారులకు వినతి పత్రాలు, కలెక్టర్ కార్యాలయాలు ముట్టడిని చేశారని చివరగా నిన్న చలో హైదరాబాద్ సందర్భంగా కోటిలో శాంతియుతంగా నిరసన చేయడానికి వేలాది మంది ఆశా వర్కర్లు వచ్చిన ఆశలతో మాట్లాడి సమస్యలు ముఖ్యమంత్రి అధికారులతో చర్చించి పరిష్కరించకుండా, మహిళల బట్టలు చినిగిపోయేటట్లుగా లాగేసి, వ్యాన్ లో పడేసారని రక్తం కారేటట్లుగా దెబ్బలు తగిలాయని మహిళలను నడిరోడ్డు మీద ఇడ్చే ఈ విధంగా అవమానించినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్చించి సమస్యలు పరిష్కరించకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఆశ వర్కర్లకు సిఐటియు నాయకులు కార్యకర్తలు వారికి అండగా ఉండడమే కాకుండా వారి యొక్క డిమాండ్లను నెరవేర్చేంతవరకు వారి వెంట ఉంటూ వారికి న్యాయం జరిగే అందంగానే ధర్నాలోకైనా వస్తారో పాలకైన అమర నిరాహారదీక్షకైనా మా పార్టీ తరఫునుండి మా సిఐటియు నాయకులు ఎల్లవేళలా వారు వారి యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలుపుకోవాలని ఆశ వర్కర్ల ఆడపడుచుల పై దాడులు చేయడం భరతమాతను అవమానించినట్లుగానే భావిస్తూ ఆశ వర్కర్ల ఉద్యమ కార్యక్రమానికి సిఐటియు మందతు పలకడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి నర్సమ్మ, వెల్దుర్తి సిఐటియూ నాయకులు గౌరీ, నరేందర్, తదితరులు పాల్గొన్నారు