

ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం
*శాసనసభలో ఎమ్మెల్యే రామరావు పటేల్ లేవనెత్తిన అంశంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ*
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చు 26 :- రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూములు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గళం విప్పడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాసనసభలో జవాబిచ్చారు.. పూర్తి వివరాలు ఎమ్మెల్యేరామారావు పటేల్ మాకు అందిస్తే సమగ్ర విచారణ జరుపుతామన్నారు. దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వీటిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభమవుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గిరిజన రైతులు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పటేల్ అసెంబ్లీ దృష్టికి తీసుకురాగా, రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు కలిసి సమస్యను పరిష్కరించేలా పాటుపడతానన్నారు. ఫారెస్ట్ అడవుల్లో బీటీ రోడ్ల విషయమై క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు చేపడతానన్నారు.