

ఆర్మూర్ సిద్దుల గుట్టపై అంతరంగా వైభవంగా జరిగిన శ్రీరామ నవమి వేడుకలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఏప్రిల్ 06 మనోరంజని ప్రతినిధి,- ఆర్మూర్ పట్టణంలోని నవనాథ్ సిద్దుల గుట్ట పై శ్రీరామనవమి వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు, మరియు ఆలయ కమిటీ మెంబర్స్ అశేష భక్తజనం పాల్గొని శ్రీ సీతారాములు వారిని దర్శించుకుని అనంతరం అన్నదానం సేవా కార్యక్రమం ప్రారంభించి, ఆలయ కమిటీ మెంబర్స్, ఆర్మూర్ సర్వ సమాజ్ సభ్యులు, అన్ని పార్టీల నాయకులు మరియు భక్తులు దాతలు ఇచ్చిన విరాళాలతో అన్నదానం కార్యక్రమాన్ని చేశారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు, భక్తుల సహాయ సహకారంతో శ్రీ రాముల వారి జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు ఘనంగా జరిగాయి, ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, శ్రీ సీతారాముల వారి కృపకు పాత్రులు అయ్యామని ఆనందాన్ని తెలియజేశారు