

ఆర్టీఐ దరఖాస్తుదారులకు తప్పుడు సమాచారం – నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
హక్కుల కోసం ప్రజలు ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) ద్వారా సమాచారం కోరితే, సంబంధిత అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఆర్టీఐ కమిషనర్, పిఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) మరియు అప్పీల్ అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రజలను తీవ్రంగా నిరాశపరిచేస్తోంది.
మంచిర్యాల రిజిస్ట్రేషన్ ఆఫీస్ వివాదం
మంచిర్యాల జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించిన భూమి సమాచారం కోరుతూ ఓ దరఖాస్తుదారు అదిలాబాద్ జిల్లా పై అధికారిని సంప్రదించారు. ఆ అధికారి తన పరిధిలో రాదని పేర్కొని, సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(3) ప్రకారం, మెమోను మంచిర్యాల జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఫార్వర్డ్ చేశారు.అయితే, సంబంధిత అధికారి దరఖాస్తుదారుకు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం, ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
సమాచారం కోసం ప్రజలు ఆశ్రయిస్తే, వారిని గందరగోళానికి గురిచేయడం దురదృష్టకరం. ఇప్పటికైనా అదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులు స్పందించి, మంచిర్యాల జిల్లా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోతే, ఈ వ్యవహారాన్ని మరింతగా ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని బాధితులు హెచ్చరిస్తున్నారు