

ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 28 :-రక్తదానం ఒక గొప్ప సేవ. అవసరమైన సమయంలో ఎర్ర రక్త కణాలు అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చు. నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) దీనికి గొప్ప ఉదాహరణ. లింబన్న అనే వృద్ధుడికి అత్యవసరంగా ఓ-పాజిటివ్ ఎర్ర రక్త కణాలు అవసరమని తెలిసిన వెంటనే, ఆయన తన పని పక్కన పెట్టి ముందుకు వచ్చారు. జీవందన్ బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేసి, రోగికి జీవం పోశారు.
రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఏడాదికి మూడు నుండి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి పనులకు ఎల్లప్పుడూ ముందుండాలని రాజు (దత్తు) చూపించిన ఉదాహరణ అందరికీ స్పూర్తిగా మారాలి