

ఆన్‌లైన్ మోసాలని అరికట్టేందుకు ఎక్స్‌జోర్కీసైన్ మెయిల్, ఎక్స్‌జోర్కీసైన్ స్పాట్ సాఫ్ట్‌వేర్
డిజిటల్ యుగంలో భద్రతా పరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చెన్నైకి చెందిన ఒడిస్సీ టెక్నాలజీస్ లిమిటెడ్ రెండు కొత్త సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్ వేదికగా శుక్రవారం వీటిని విడుదల చేసింది. డిజిటల్ కమ్యూనికేషన్‌లో ఈ ప్రొడక్ట్‌లు సరికొత్త విప్లవమని, వీటితో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆ సంస్థ సీఎండీ రాబర్ట్ రాజా తెలిపారు. ఎక్స్‌జోర్కీసైన్ మెయిల్, ఎక్స్‌జోర్కీసైన్ స్పాట్ పేర్లతో వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ‘డిజిటల్ అరెస్ట్’, స్కామ్‌లు, ఆన్‌లైన్ ఐడెంటిటీ థెప్ట్, ఎక్స్‌టార్షన్, రాన్సమ్‌వేర్ దాడులను ఈ సాఫ్ట్‌వేర్లతో అడ్డుకోవచ్చని అన్నారు