ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం.

ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం.

మనోరంజన్ న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 27 పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి ఇట్టి మోసగాళ్ళ చేతిలో చిక్కుకొని 57,13,332 రూపాయలు మోసపోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి రాగా డిజి,,షికా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. అంబర్ కిషోర్ జా ఐపిఎస్ ఆదేశాల మేరకు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ యం.వెంకటరమణ డి.ఎస్.పి కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినారు.ఇట్టి పరిశోధనలో డి.ఎస్.పి మరియు జె.క్రిష్ణముర్తి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడుని నపవాడి గ్రామం,రహతా మండలం,ఆహుల్యానగర్ ఓల్డ్ అహ్మద్నగర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రం, నందు పట్టుకొని విచారించగా అతని పేరు శుభం నవనాథ్ షెల్కే,s/o: నవనాథ్ ఏకనాథ్ షెల్కే, వయస్సు: 20 సంవత్సరాలు, వృత్తి: స్టూడెంట్ R/o:నపవాడి గ్రామం,రహతా మండలం,ఆహుల్యానగర్ ఓల్డ్ అహ్మద్నగర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రం, ఇతడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో టెలిగ్రామ్ లో పరిచయమైన ఒక వ్యక్తికి ఇతడి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ పాస్ బుక్ మరియు ఎ.టి.ఎం అతనికి ఇచ్చి ఇట్టి అకౌంట్ ఇచ్చినందుకు గాను నెలకు 5000 రూపాయలు కమిషన్ తీసుకుంటూ ఇలా వచ్చిన డబ్బులను అతని అవసరాలకు జల్సాలకు వాడుకుంటున్నాడు అట్టి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ , యం.వెంకటరమణ డి.ఎస్.పి ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ మరియు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ , లోన్ యాప్స్ , డిజిటల్ అరెస్ట్ , మల్టీ లెవెల్ మార్కెటింగ్ , క్రిప్టో కరెన్సీ , ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ , ఓటిపి, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ లను నమ్మి మోసపోకూడదు,మరియు సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్ప్స్ లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు మరియు సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు

  • Related Posts

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన. మనోరంజని స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చెందిన దార్ల హేమ దుర్గా ప్రసన్నను (31) గంగన్నగూడెం గ్రామానికి చెందిన మోదుగ సాయి బలవంతంగా లోపర్చుకొని ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను…

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు

    బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయాలు మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- బైక్ తో స్తంభానికి ఢీకొని వ్యక్తి గాయపడిన ఘటన శనివారం ముధోల్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బైక్ వస్తున్న ఉరేకర్ పోతన్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం