

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ నిర్మాణానికి చొరవ తీసుకోవాలి
ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్
మనోరంజని ప్రతినిధి మార్చి 05 ఆదిలాబాద్ :- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల విమానాశ్రయ స్థలంలో విమానాశ్రయ నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర జిల్లాలలో తగిన సౌకర్యాలు లేకున్నప్పటికి అక్కడి ప్రజా ప్రతినిధుల చొరవతో విమానాశ్రయాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని కాని ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం విమానాశ్రయ నిర్మాణం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. విమానాశ్రయ నిర్మాణానికి అన్ని అర్హతలున్నప్పటికి ప్రజా ప్రతినిధుల పట్టింపు లేకపోవటం వలన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల కల కలగానే మిగిలిపోతుందని అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణం వలన రవాణా సౌకర్యాలు మెరుగుపడి వాణిజ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగ కరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు వెంటనే చొరవ తీసుకుని పనులు ప్రారంభించే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఎడల అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని దశల వారీ ఉద్యమాలకు పూను కుంటామని ఆయన తెలిపినారు.