

ఆటో వాలా గా.. మంత్రి సవిత
సొంతసొమ్ముతో.. కార్యకర్తకు కానుక
ఏపీ బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆటో వాలా గా మారారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన ఎన్.బీ.కే ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వడ్డే రాముకు స్వయం ఉపాధి కోసం మంత్రి సవిత తన సొంత నిధులతో నూతన ఆటోను కొనిచ్చారు. మంత్రి ఆటోను స్వయంగా నడిపి కార్యకర్త రాముకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన విధంగా అండగా ఉండడంలో తన వంతు కర్తవ్యం గా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు