

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్‌తో పాటు అనేక మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ మెట్రో సమీపంలో ఆందోళన చేస్తున్న గిద్దె రాజేష్ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనపై ఎన్ని కేసులు అయినా పెట్టుకోండని, అక్రమ అరెస్టులకు భయపడబోమని గిద్దె రాజేష్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఉద్యమాలను అడ్డుకోవడం హేమమైన చర్యగా ఆయన విమర్శించారు. ఈ ఘటనపై వికలాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే అరెస్టులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
