అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

అసలు విషయం చెప్పేసిన కల్పన కూతురు..

హైదరాబాద్, మార్చి 05: తన కూతురు వల్లే సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తన కూతురు తన మాట వినలేదనే కారణంగా మనస్తాపానికి గురైన కల్పన.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారాలు, వార్తలపై కల్పన కూతురు తొలిసారి రియాక్ట్ అయ్యింది. కల్పన ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న ఆమె కూతురు.. హుటాహుటిన కేరళ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మరి పోలీసులకు కల్పన కూతురు ఏం చెప్పింది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కల్పన కూతురు స్టేట్‌మెంట్ ఇదే..

కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించింది. తన తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ వేసుకుందన్నారు. డాక్టర్ సూచించిన నిద్రమాత్రలే వేసుకుందని వివరించింది. మానసిక ప్రశాంతత కోసం నిద్రమాత్రలు వేసుకుంటోందని కల్పన కూతురు తెలిపింది. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదన్నారు. తన తల్లి కల్పన హైదరాబాద్‌లో లా పీజీ చేస్తోందని వివరించింది. కల్పన మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడేదని పేర్కొంది.

పోలీసులు ఏం చెప్పారంటే..

కల్పన పెద్ద కూతురు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. అంతకుముందు.. కేరళ నుంచి హైదరాబాద్ రమ్మంటే కూతురు రావడం లేదని కల్పన మనస్థాపనం చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేరళ వెళ్లిన సందర్భంలో కూడా ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరిగాయట. హైదరాబాద్‌కి వచ్చిన తరువాత మరోసారి కూతురుని తన వద్దకు రావాలని కల్పన కోరిందట. అయినప్పటికీ ఆమె అంగీకరించలేద. దీంతో తన కూతురు తన మాట వినడం లేదని కల్పన మనస్తాపానికి గురైందని, అలా నిద్ర మాత్రలు వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కల్పన మొదటి భర్త కూతురు కేరళలో చదువుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేయాలని కల్పన ఆమెను అనేకసార్లు కోరింది. ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.. KP

  • Related Posts

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం. -విద్యార్థులు-విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :-నిర్మల్ జిల్లా – సారంగాపూర్: కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, దశరథ్,మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కెఎన్ఆర్ ట్రస్టు సేవలు అభినందనీయం.

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం