అర్హులైన దివ్యాంగులకు UDID కార్డుల జారీపై ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్

అర్హులైన దివ్యాంగులకు UDID కార్డుల జారీపై ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- అర్హులైన దివ్యాంగులకు యూనిక్ డిసెబిలిటీ ఐడీ (UDID) కార్డుల జారీని వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో UDID కార్డుల జారీ, దివ్యాంగుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 1, 2025 నుండి ప్రభుత్వం ప్రత్యేక డైనమిక్ వెబ్ ఎనేబుల్ సిస్టమ్‌ను రూపొందించిందని, దీని ద్వారా అర్హులైన దివ్యాంగులకు UDID కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. సదరం సర్టిఫికెట్ ఉన్నవారు లేదా కొత్తగా కార్డు కావాలనుకునేవారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తుదారులకు ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షల అనంతరం UDID కార్డులు జారీ చేస్తారని, ఈ కార్డులు 21 రకాల వైకల్యాలు కలిగిన వారందరికీ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని పెంచే దిశగా వేగంగా ముందుకు సాగాలని సూచించారు. సదస్సులో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఇతర అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు

  • Related Posts

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!! KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో…

    తెలంగాణకు గ్రామస్థాయి అధికారులు వస్తున్నారహో… మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 22 – గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్దీస్తా మని, సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే మంత్రిమండలి 10,954 గ్రామ పరిపాలన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!