

అమెరికాలో తుఫాను విధ్వంసం.. 34 మంది మృతి
మనోరంజని ప్రతినిధి మార్చి 16 – అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఇటీవల కార్చిచ్చు చెలరేగి భారీ నష్టం మిగల్చగా తాజాగా టోర్నడోలు, తుఫాన్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాయి. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లు సమాచారం. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. అలాగే ఇతర చోట్ల జరిగిన ప్రమాదాల్లో అనేక మంది మరణించినట్లు తెలుస్తోంది