

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి :
తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శిను కలసి వినతి పత్రం అందజేసిన ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు
మనోరంజని ప్రతినిధి ఉట్నూర్ : మార్చి 06 :- అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి డా.ఎ.శరత్ ను ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గురువారం ఆయన ఛాంబర్ లో కలసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలోని నూతన ఐటిడిఎ భవన నిర్మాణానికి 15కోట్లు,నూతన స్టడీ సర్కిల్ నిర్మాణానికి 2 కోట్లు,నూతన రాజ్ గోండు సేవ సమితి గుస్సాడి గుట్ట వద్ద నూతన భవన నిర్మాణానికి 1కోటి రూపాయలు,పాత ఉట్నూర్ నుండి కొమ్ముగూడ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు