అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…

అప్పుడే పుట్టిన ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు..గుజరాత్ టూ…తెలంగాణ…. ఏపీ…..!పోలీసుల విచారణ లో వెలుగులోకి సంచలన నిజాలు..!

మనోరంజని ప్రతినిధి మార్చి 20


హైదరాబాద్

ఓ వందన..

ఇంకో సరోజిని..

మరో కృష్ణవేణి..

ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..?

వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు..!

గ్యాంగ్ అంతటికీ లీడర్‌ అమూల్య.

ఓ స్టేట్‌లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్‌లో విక్రయించడం అమూల్య బిజినెస్..

పేరుకు ఆశా వర్కర్..

చేసిది మాత్రం పిల్లలను అమ్మే బిజినెస్..

ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకుని నెట్‌వర్క్‌ను అంతకంతకు విస్తరించింది.

ఆ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠా…

తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది.

మొత్తం పదిమంది చిన్నారుల్ని రెస్క్యూ చేశారు రాచకొండ పోలీసులు.

కాపాడిన వారిలో ఆరుగురు ఆడ, నలుగురు మగ శిశువులు ఉన్నారు.

గుజరాత్‌, మహారాష్ట్రలో పిల్లలను కొని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు.

చిన్నారులను రక్షించిన చైతన్యపురి పోలీసులు.. మధురానగర్లోని శిశు విహార్ కు తరలించారు. ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులేనని పోలీసులు తెలిపారు.

తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు మధురానగర్లోని శిశు విహార సంరక్షణలో చిన్నారులను ఉంచనున్నారు. వారి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, వారి బాగోగులు చూడాలని శిశు విహార్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు.

తొమ్మిది మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయని.. 16 మందిని రెస్క్యూ చేయగా.. ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని తెలిపారు

  • Related Posts

    గతంలో గొడవ పడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు..

    గతంలో గొడవ పడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు.. మనోరంజని ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా:: మార్చి 21 – వేములవాడ దర్గా కు తలం వేస్తున్నట్లు వస్తున్న వీడియో గతంకి సంబంధించినది: వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్…

    బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్?

    బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్? మనోరంజని ప్రతినిధి యాదాద్రి జిల్లా :మార్చి 21 – యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం తహశీల్ధార్ ను కలెక్టర్ హనుమంతరావు,ఈరోజు సస్పెండ్ చేశారు. బీబీనగర్ మండలం పడమట సోమారం,గ్రామంలో ఫీల్డ్ లో ప్లాంట్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం..!!

    తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం..!!

    గతంలో గొడవ పడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు..

    గతంలో గొడవ పడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు..

    బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్?

    బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్?

    TG : రేపు, ఎల్లుండి వడగళ్ల వాన గండం..!!

    TG : రేపు, ఎల్లుండి వడగళ్ల వాన గండం..!!