

అనువైన చోట రాజక సంఘం భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలి :
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని కోరిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 06 : డా.బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని కలిసి గతంలో హైదరాబాద్ లో రజక సంఘం భవనం నిర్మాణానికి మేడిపల్లి గ్రామంలో భూమి కేటాయిస్తే ఆ స్థలం భవనం నిర్మాణానికి అనుకూలంగా లేదని తెలిపారు. కావున ఉప్పల్ బాగాయత్ లో స్థలం కేటాయించామని కోరారు. ఈ కార్యక్రమంలో వట్టికోటీ శేఖర్,రాజు తదితరులు పాల్గొన్నారు..