

అనారోగ్యానికి గురైన ఏఈఓకు ఆర్థిక సాయం చేయండి
మనోరంజని ప్రతినిధి ( డొంగ్రే చంద్రమని సీనియర్ రిపోర్టర్ ) మార్చి 04 :-.
నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబేర క్లస్టర్ ఏవోఓగా విధులు నిర్వహిస్తున్న డి. శ్రీనివాస్ మెదడులో నరాల సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్సకు ఇప్పటివరకు కుటుంబ సభ్యులు 3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. వైద్యులు చికిత్సను ఇంకా కొనసాగించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. చికిత్స కొరకు మరింత డబ్బులు అవసరం కావడంతో కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏఈఓకు తమవంతుగా ఆర్థిక సాయం చేసి దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. సాయం చేసే దాతలు వాగ్మరే ప్రవీణ్ 9705960228/ భాలేరావు రిషికేష్ 9177437230 ఫోన్ పే-గూగుల్ పే నెంబర్ కు పంపాలని కోరారు.