

అధునాతన లేజర్ ఆయుధాన్ని ఆవిష్కరించిన భారత్
భారతదేశానికి చెందిన DRDO 20 Kmపరిధి కలిగిన 300 కిలోవాట్ల డైరెక్ట్-ఎనర్జీ లేజర్ ఆయుధం ‘సూర్య’ను అభివృద్ధి చేసింది. శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను ఖచ్చితత్వంతో న్యూట్రలైజ్ చేయడానికి రూపొందించిన ఈఆయుధం భారతదేశ రక్షణ సామర్థ్యాలలో ఒక పెద్ద ముందడుగు. ఈ పురోగతి మెరుగైన వాయు రక్షణ కోసం అధునాతన డైరెక్ట్-ఎనర్జీ ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న అతి కొన్ని దేశాల సరసన భారతదేశాన్ని నిలుపుతుంది.