

అదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈరోజు పర్యావరణం మరియు ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. అతీక్ బేగం అధ్యక్షత వహించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. నవీన్ కుమార్ విద్యార్థులకు పర్యావరణ సమస్యలు, వాటి ప్రభావం, నివారణ మార్గాల గురించి వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎస్. నారాయణ క్యాన్సర్ సమస్యలు, మనం తాగే నీటి వనరుల ప్రాముఖ్యతపై పలు కీలక విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. వెంకటేష్ కోటయ్య, బోధన సిబ్బంది అనిత, చంద్రకాంత్, గోపాల్, కునాల్ సహా అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.
