

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 20 :- మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తో కలిసి అడెల్లి నుండి బోథ్ వరకు పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత, అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు అల్లోల మురళీధర్ రెడ్డి, నారాయణ రెడ్డి, డీసీఎం చైర్మన్ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాధవరావు, మండల కన్వీనర్ మహిపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పీవీ రమణారెడ్డి, హాకీ జిల్లా అధ్యక్షులు పాకాల రాంచందర్ తదితరులు పాల్గొన్నారు
